MF4TV: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉప విద్యాశాఖ అధికారి స్టాఫ్ కు వినతి పత్రం అందజేసిన ఏబీవీపీ నాయకులు...
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కన్వీనర్ చిన్న మాట్లాడుతూ గూడూరు పట్టణంలో అనేక పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు అందులో భాగంగా రెండో పట్టణ పరిధిలో శ్రీ స్వర్ణాంధ్ర భారతి పాఠశాల బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ప్రైమరీ పాఠశాలను నిర్వహిస్తున్నారు.
అదేవిధంగా క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు కాకుండా ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ ఫెయిల్ అయిన ఉపాధ్యాయులచే విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు, ఆట స్థలం లేకుండా పాఠశాలలు నిర్వహిస్తున్నారు, అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా వార్షికోత్సవం పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుండి 700 రూపాయలు వసూలు చేస్తూ తల్లిదండ్రులని ఇబ్బంది పెడుతున్నారని అందుకే అధికారులకు ఫిర్యాదు చేశామని ఏబీవీపీ నాయకుడు చిన్నా తెలియజేశారు వెంటనే ఉప విద్యాశాఖ అధికారి చర్యలు తీసుకోవాలని లేకపోతే ఉద్యమం తప్పదని వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి నజీర్ మరియు ఏబీవీపీ నాయకులు నవీన్ కృష్ణ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు