MF4TV: బాలాయపల్లి మండలంలోని పిగిలాం గ్రామంలో పిగిలాం అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నవభారత నిర్మాత, రాజ్యాంగపు ప్రదాత, బడుగు బహిష్కృత వర్గాల ఆశాజ్యోతి, మహనీయుడు డా. బి.ఆర్. అంబేడ్కర్ గారి 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిగిలాం గ్రామ యువకులు ప్రవీణ్, పవన్, అశోక్, రాజేష్, శ్రీనివాసులు, వంశీ, సూర్య, రాకేష్, సాయికిరణ్, వెంకటరమణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.