
MF4TV గూడూరు: వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని సోమవారం ఉదయం జేఏసీ ఆధ్వర్యంలో నెల్లూరులో జరగనున్న శాంతియుత నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని మైనార్టీ నాయకులు మత గురువు మొహమ్మద్ మగ్దూమ్ ఒక ప్రకటనలో కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ముస్లింల పై విద్వేషపూరితమైనటువంటి వక్ఫ్ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టినందుకు నిరసనగా భారతదేశం మొత్తం శాంతియుత నిరసన ర్యాలీలు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని అందులో భాగంగానే నెల్లూరు జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నెల్లూరు కోటమిట్ట షాదీ మంజిల్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు జరిగే శాంతియుత ర్యాలీ కి ఉదయం 9 గంటలకు అందరూ పార్టీలకతీతంగా వర్గాలకతీతంగా ప్రతి ఒక్కరు తప్పకుండ హాజరుకావాలని ఈ నల్ల చట్టాన్ని రద్దు చేసేంతవరకు మన గళాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని అందుకోసం జరిగేటటువంటి నిరసన ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరారు వాహనాల పార్కింగ్ కోసం జామియా నూరుల్ హుదా మద్రసా మూలపేట లో ఏర్పాటు చేసి వున్నారని మరియు రిటర్న్ లో దూరప్రాంతాల నుండి వచ్చిన వారందరికి జామియా నూరుల్ హుదా మద్రసా లో భోజనాలు ఏర్పాటు చేసివున్నారని అన్నారు. కావున ర్యాలీ కి వచ్చే ప్రతి ఒక్కరు నల్ల బ్యాడ్జి, నల్ల రిబ్బన్ కట్టుకొని వచ్చి నిరసన తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు మత గురువు మగ్ధూమ్,సయ్యద్ సలీం, కరిముల్లా పాల్గొన్నారు