
MF4TV: నేటి యువతరానికి ఆదర్శం…. వెంకీ తన ప్రతి పుట్టిన రోజు వేడుకను నిరుపేదలు, నిరాశ్రయులతో పంచుకోవడం ఒక అలవాటుగా మార్చుకున్నాడు..
గత 7 సంవత్సరాలనుండి ఒక అలవాటుగా ఇష్టంగా చేస్తూ వస్తున్నాడు.. ఈ ఏడాది కూడా తన పుట్టినరోజు ను ప్రతి సంవత్సరం లాగే ఏదో ఒక రూపంలో తనకు చేతనైనంత సహాయం చేయాలనే ధృడ సంకల్పంతో పలు ప్రాంతాల్లో ఉన్న పేదలు మరియు ఆశ్రమాలలో వుండే వారికి చికెన్ బిర్యానీ, వాటర్ ప్యాకెట్లు, అరటిపండు, వడ మరియు పాయసం పంపిణీ చేశారు.
అదే విధంగా, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని 70 మంది యాచకులకు టోపీలను పంపిణీ చేశారు.
ఈ విధమైన సేవా కార్యక్రమాలు సమాజానికి మంచి మార్గదర్శకంగా నిలుస్తాయని ఆశిస్తూ, మా MF4TV తరఫున వెంకీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.