టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ- బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Baskar) కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya) హీరోయిన్ గా నటించబోతుందనే తెలుస్తోంది. బేబీ హిట్ తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది వైష్ణవి. అందులో ఈ అమ్మడు యాక్టింగ్ కు ఫిదా అవ్వని యూత్ ఎవరూ ఉండరు. దీంతో ఈమెకు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రామ్ సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు సిద్ధూ సినిమాలో అవకాశం దక్కించుకుంది. దీనిపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ‘టిల్లు స్క్వేర్'(Tillu Square)లో నటిస్తున్నాడు. డీజే టిల్లు బ్లాక్ బస్టర్ తర్వాత సిద్ధు నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై వీర లెవల్లో అంచనాలు ఉన్నాయి. నరుడా డోనరుడా ఫేం మల్లిక్‌రామ్ (Mallik Ram) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ పై మూవీపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నాడు. టైటిల్‌కు తగ్గట్టుగానే డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతున్నట్టు మూవీ టీమ్ తెలిపింది. ఈ చిత్రాన్ని అక్టోబరు 06న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.