పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan)-శ్రీలీల (Sreeleela) జంటగా నటిస్తున్న యాక్షన్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat singh).
హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ అభిమానులకు ఉత్సాహాన్ని ఇస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) చేసిన ట్వీట్ అందులోని పవన్ కల్యాణ్ షూటింగ్ టైమ్ లో పిక్స్ వైరల్ అవుతున్నాయి.
‘అందరూ ఊపిరి బిగపట్టుకోండి బాయ్స్ అండ్ గర్ల్స్.. వస్తున్నాడు భగత్ సింగ్. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్ మళ్లీ సెట్స్ లో అడుగుపెట్టింది. ఇప్పటి నుంచి నాన్ స్టాప్ గా జరిగే షూటింగ్ లో పవర్ ప్యాక్డ్ యాక్షన్ షెడ్యూల్స్ జరుగనున్నాయి’ అని ట్వీట్ చేసింది.
దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ లో పవన్ కల్యాణ్ అప్పీయరెన్స్, డైలాగ్స్, స్టయిల్ ఆకట్టుకున్నాయి. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.