MF4 TV: గూడూరు : సమ సమాజ స్థాపనకు మూలస్థంభాలు పాత్రికేయులేనని ఏస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రవి రాఘవేంద్ర అన్నారు. శుక్రవారం పెద్ద మసీదు వీధిలోని యునైటెడ్ ఫోరం కార్యాలయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సన్మాన సభ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రెండు వేర్వేరు అసోసియేషన్లను ఏర్పాటు చేసుకోవడం శుభ పరిణామమన్నారు. ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు ఫోరం తరపున సహకారం అందిస్తామన్నారు. అందరినీ ఒకే వేదికపై కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఫోరం జాతీయ ఉపాధ్యక్షులు వేగూరు విజయ్ కుమార్ మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి కోసం యూనియన్లను ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు.
కత్తిపోటు కంటే కలం పోటు, స్టన్ గన్ కంటే పెన్ గన్ గొప్పవన్నారు. ఇచ్చిన మాట మేరకు ఫోరం తరపున 50వేలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంక్షేమ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు. ఫోరం ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మాకాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ
పాత్రికేయులు కలిసికట్టుగా ముందుకెళ్లాలని సూచించారు.
ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని పరామర్శించిన మంత్రి కాకాణి
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్లకు రూ. 50వేలు విరాళం
ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు ఫోరం సహకారం ఉంటుంది
చెడును బహిర్గతం చేసే పాత్రికేయులు మంచిని ప్రోత్సహించాలి
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు 40 మందికి ఫోరం ఆధ్వర్యంలో ఘన సన్మానం
ఫోరం బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు పొట్టేళ్ల పెంచలయ్య యాదవ్ మాట్లాడుతూ స్వతంత్రంగా ఎదగడం వేరు సమూహంగా ఎదగడం వేరన్నారు.సమూహంగా ఉంటే హక్కులు సాధించుకోగలమన్నారు. విలేకరులు సమాజంలో చోటుచేసుకునే అవినీతి అక్రమాలను ఎలా బయటపెడుతారో అలాగే నీతి నిజాయితీతో సమాజం కోసం పనిచేసే వారిపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఏపీలో ఈ నెల 9 నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు
ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్. జమాలుల్లా మాట్లాడుతూ ఫోరం ఏర్పడినప్పటినుండి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి దోహదపడుతోందన్నారు. చైతన్య యాత్రల పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలో రాజకీయ, సామాజిక చైతన్యం కోసం యునైటెడ్ ఫోరం చేసిన కృషి అభినందనీయమన్నారు. స్వార్థ రహిత సేవలు ప్రజల మనసులను ఆకట్టుకుంటాయనడంలో ఎటువంటి సందేహం లేదని ఫోరం సేవలను కొనియాడారు.
తెలుగు రాష్ట్రాల్లో “సలార్” సెన్సేషన్!
ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు ఎం. ప్రభుదాస్ మాట్లాడుతూ వార్తలు, ప్రకటనలు సేకరించే క్రమంలో విలేకరులు నిత్యం పరుగులు తీస్తుంటారని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను సన్మానించేందుకు ముందుకొచ్చిన యునైటెడ్ ఫోరం సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను శాలువాలతో సన్మానించారు. మెమెంటోలతో పాటు 50వేల రూపాయల నగదును రెండు యూనియన్లకు ఫోరం జాతీయ అధ్యక్షులు చేతులమీదుగా అందించారు.
ఈ కార్యక్రమంలో ఫోరం సభ్యులు గూడూరు గోపాల్, సాంబమ్మ, వెంకటేశ్వర్లు,మణి, అయ్యప్ప, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు షేక్. జమాలుల్లా, శివ కుమార్, ఉడతా శరత్ యాదవ్, ప్రభుదాస్, పర్చూరు బాలకృష్ణ, సుబ్రమణ్యం, గుమ్మడి అనిల్ కుమార్, భవానీ ప్రసాద్, శశిధర్, యాక్ట్ శ్రీను, సలీం, మంగళపూరు శ్రీనివాసులు, కృపానిధి, పలువురు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల తదితరులు పాల్గొన్నారు.