UPDATES  

NEWS

 మున్సిపల్ కార్మికుల సమ్మెకు యునైటెడ్ ఫోరం మద్దతు

MF4TV గూడూరు : గూడూరు పురపాలక సంఘ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన నిరవధిక దీక్షలు శనివారంతో 12వ రోజుకు చేరుకున్నాయి. ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ యునైటెడ్ ఫోరం కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపింది.

సమసమాజ స్థాపనకు మూలస్థంభాలు పాత్రికేయులు:యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రవిరాఘవేంద్ర

ఈ సందర్భంగా ఆ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రవి రాఘవేంద్ర మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. రోజూ వేకువజామున లేచి మధ్యాహ్నం వరకూ పనిచేస్తే తప్ప పట్టణం పరిశుభ్రంగా మారదన్నారు. మనకోసం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోరికలు తీర్చాల్సిన కనీస

జగన్ నీ నమ్ముకుంటే చెవిలో పువ్వు పెడతారని మున్సిపల్ కార్మికులు నిరసన

బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఐదు నెలలుగా కొంతమంది కార్మికులకు జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. వెంటనే బకాయిలు చెల్లించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫోరం ఆధ్వర్యంలో కార్మికులకు సంఘీభావంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫోరం ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మాకాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలందరూ ఇళ్లలో ఉంటే కాలువలలో పూడికతోపాటు పారిశుద్ధ్యం మెరుగుకు ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారన్నారు. అటువంటి కార్మికులకు ఎంతచేసినా తక్కువేనన్నారు. అంతకుముందు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

3కోట్ల 15లక్షలతో నూతనంగా నిర్మించిన ‘సామాజిక ఆరోగ్య కేంద్రాని ప్రారంభోత్సవం చేసిన జిల్లా కలెక్టర్ యమ్. నారాయణ్, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి,

ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పొట్టెళ్ల పెంచల్ యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు గోపాల్, జిల్లా నాయకులు సాంబమ్మ, వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకులు గోపీనాధ్, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

 

మున్సిపల్ కార్మికుల సమ్మెకు యునైటెడ్ ఫోరం మద్దతు

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |

© Copyright MF4TV 2024 - All rights reserved.

Developed by RAAMSEE