UPDATES  

NEWS

 ములుగు జిల్లా కమలాపురంలో “బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్” (BILT) కంపెనీ పునరుద్ధరణపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సీనియర్ అధికారులతో సమీక్ష…

MF4TV: ములుగు జిల్లా : ఈ మిల్లులో వస్త్రాల తయారీకి ఉపయోగించే కలప గుజ్జు తయారవుతుంది. 2014 లోనే ఈ మిల్లు మూతపడింది. దీంతో దాదాపు 750 కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. వీరందరికీ ఉపాధి కల్పించటంతో పాటు స్థానికంగా ఉద్యోగ కల్పనకు వీలుగా ఈ మిల్లును తిరిగి తెరిపించేందుకు ముఖ్యమంత్రి చొరవ చూపారు.

నేషనల్ కంపెనీ లా ట్రిబున్యల్ తీర్పు ప్రకారం ప్రస్తుతం బిల్ట్ కంపెనీ ఆస్తులు ఫిన్‌క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినంలో ఉన్నాయి. ఆ కంపెని ఎండీ శ్రీ హార్దిక్ పటేల్‌, ఐటీసీ పేపర్ బోర్డ్స్ డివిజన్ సీఈఓ శ్రీ వాదిరాజ్ కులకర్ణితో పాటు సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి డా. బి. ఆర్. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు సమావేశమయ్యారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించాలనే ఆలోచనను వారితో పంచుకున్నారు. ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు, సాధ్యాసాధ్యాలను చర్చించారు.

తెలంగాణాలో వెల్ స్పన్ Welspun World గ్రూప్ పెట్టుబడులు

మిల్లును తెరిపించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఫిన్‌క్వెస్ట్ బృందాన్ని కోరారు. బిల్డ్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఐటీసీ కంపెని ఆసక్తి చూపుతోంది. ఫిన్ క్వెస్ట్ కంపెనీ ఐటీసీతో చర్చల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కోరారు. బిల్ట్ మిల్లును పునరుద్ధరించే ప్రక్రియలో ఐటీసీకి అన్ని విధాలా ప్రభుత్వ సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఐటీసీ చేపట్టిన ప్రాజెక్టులు, భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలపైనా ఈ సమావేశంలో చర్చలు జరిగాయి.

సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది: CM Revanth Reddy

సీఎంతో పాటు మంత్రులు అనసూయ గారు, శ్రీమతి కొండా సురేఖ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, సీఎంఓ అధికారులు, ములుగు కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్లోకి మళ్లి బజాజ్ చేతక్

గత ప్రభుత్వం 2015, 2018లో ప్రోత్సాహకాలను పొడిగించి, మూతపడ్డ ఈ యూనిట్‌ను పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

తాండల్ trailer

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |

© Copyright MF4TV 2024 - All rights reserved.

Developed by RAAMSEE