MF4TV: దొరవారిసత్రం మండలం పరిధిలో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని దోరవారిసత్రం యస్ ఐ తిరుమలరావు హెచ్చరించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడి పందాలు, జూదం నిర్వహణ, ఇతర అసాంఘిక కార్యక్రమాలు నేరమన్నారు.
ఈ ఉత్తర్వులను ఎవరైనా అధిగమిస్తే చట్టప్రకారం శిక్ష తప్పదన్నారు. ఎక్కడైనా కోడి పందేలు,జూదం,నాటుసారా కాయడం అమ్మడం, దొంగతనాలు లాంటి చట్ట విరుద్దమైన కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు తెలిస్తే ఆ సమాచారాన్ని క్రింది నెంబర్లకు ఫోన్ చేసి తెలియచేయాలన్నారు..
94407 96359,94407 96356