MF4TV: కళ్యాణ్ రామ్ తొలి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది చివరిలో విడుదలైంది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించి, తెరకెక్కించాడు. సీత, అజయ్, సత్య, ఎస్తేర్, మాళవిక నాయర్ కీలక పాత్రలు పోషించారు. డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా ఆకట్టుకున్నాడు. అయితే రివ్యూస్ పరంగా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ కోసం సుమారు రూ. 45 కోట్లు రూపాయలను ఖర్చు చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ నామా వెల్లడించిన సంగతి విదితమే.
అయితే… నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామ దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త మూవీ ‘డెవిల్’…నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన డెవిల్ గతేడాది డిసెంబర్ 29న రిలీజ్ అవగా బాక్సఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నిన్న అర్ధరాత్రి నుంచి డెవిల్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.