MF4TV: ప్రజలకు అవగాహన నిమిత్తం: మానసిక ఆరోగ్యం, అవగాహన కార్యక్రమంలో భాగంగా సైకాలజిస్టులంటే ఎవరు? వారి పాత్ర ఏమిటి ? సైకాలజిస్ట్ గురించి చట్టం ఏమి చెబుతోంది.
గతంలో సైకాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేయాలంటే పి.జి రెగ్యులర్ లేక డిస్టెన్స్ కోర్స్ పూర్తి చేసి ఉంటే చాలు. సైకాలజి డిపార్ట్మెంట్ లేని యూనివర్శిటీలు కూడా డిస్టెన్స్ కోర్సెస్ ఆఫర్ చేశాయి. దీంతో వందలమంది అర్హత లేని సైకాలజిస్ట్ లు పుట్టుకొచ్చారు. దీనిని నియంత్రించాలని సైకాలజిస్ట్లకు కూడా రిజిస్ట్రేషన్ ను తీసుకొనిరావాలని, చాలా కాలంగా పోరాటం జరుగుతోంది. ఎట్టకేలకు 2021వ సం|| మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం “నేషనల్ హెల్త్ & అలైడ్ సైన్సెస్” బిల్లును ప్రవేశపెట్టింది. ఈ చట్టం ప్రకారం ఇకపై సైకాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రెగ్యులర్మోడ్ లో 3600 గంటలు చదివి ఉండాలని E & J క్లాసెస్ లో స్పష్టంగా పొందుపరిచియున్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాక్టీస్ చేస్తే రూ.50,000/-ల నుండి రూ.1,00,000/-లు వరకు జరిమానా లేదా 6 నెలల నుండి ఒక ఏడాది పాటు జైలు శిక్ష లేదా రెండు విధించవచ్చని చాప్టర్ 7 లో స్పష్టంగా హెచ్చరించింది.
సైకాలజిస్ట్ లు ఏ మానసిక సమస్యకైనా ప్రాథమికంగా నిర్ధారణ చేసి, కౌన్సిలింగ్, అసెస్మెంట్ లు మొదటిగా పరీక్షించి, అవసరమైన యెడల మిగిలిన ప్రొఫెషనల్స్కి రెఫర్ చేస్తారు.
ఉదాహరణకు : తీవ్ర ఆందోళనలు, భయాలు, దిగులు, అడిక్షన్, ఇతరత్రా మానసిక సమస్యలు. మోటివేషన్ స్పీకర్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, లైఫ్ కోచ్ లకు భిన్నంగా వీరు కౌన్సిలింగ్ మరియు థెరఫి సెషన్లు నిర్వహిస్తారు. అలాగే సైకలాజికల్ అసెస్మెంట్స్, క్లినికల్ కేసులు, M.A/M.S.C., జనరల్/ క్లినికల్ కోర్సులు రెగ్యులర్గా పూర్తి చేసినటువంటి వారు మాత్రమే అర్హులు. కౌన్సిలింగ్లో జనరల్, ఇన్ఫార్మల్ మరియు ఫార్మల్ కౌన్సిలర్స్/ థెరపిస్ట్లు అనే వివిధ రకాల అర్హత కలిగిన వారు వుంటారు.
అర్హత, అనుభవం కలిగిన వారు థెరపి నిర్వహిస్తారు. సైకియాట్రిస్ట్లు మందులు మాత్రమే సూచిస్తారు. క్లినికల్ కేసులకి “రీహాబిలేటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా” వారి లైసెన్స్ తప్పనిసరి. N.M.P. హిప్నాసిస్, ఆరా పవర్, బ్లాక్ మ్యాజిక్, రేఖి వంటి అశాస్త్రీయమైనటు వంటి చికిత్సా పద్ధతులు అనాదిగా ఆచరణలో వున్నాయి.
చాలా మంది ప్రజలకి “సైకాలజిస్ట్ లకి, సైకియాట్రిస్ట్ లకి మరియు మోటివేషన్ స్పీకర్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, లైఫ్ కోచ్” ల పట్ల అవగాహన లేని కారణంగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మరియు జీవితంలో చాలా కోల్పోతూ, కొత్త సమస్యలను కొని తెచ్చుకొని బాధపడుతూ జీవనం సాగిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా మేము సైకాలజిస్ట్ లము అని తెలిపినా గానీ, మీరు వారి వద్దకు వెళ్ళినా గానీ, వారి విద్యార్హతలు, అనుభవము, లైసెన్స్, ఏ సంస్థల నుండి వారు పట్టా పొంది వున్నారన్న విషయాలను తప్పకుండా పరిశీలించుకోగలరు.