MF4TV: నెల్లూరు జర్నలిస్ట్ భవన్ లో నిత్య పెళ్లి కొడుకు చేతిలో మోసపోయిన బాధితురాలు మీడియా సమావేశం
నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పని చేసే షబీర్ అహ్మద్ తనను మోసం చేశాడంటూ నెల్లూరు జర్నలిస్ట్ భవన్ లో మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసింది. తనకు పెళ్లైయి, భర్త చనిపోయాడని, అయినా తనను పెళ్లి చేసుకుని, తనకు సంబంధించిన నగ్న ఫోటోలు, వీడియోలు తీశాడని తెలిపింది. అయితే షబీర్ అహ్మద్‌కి పెళ్లయ్యిందని తెలిసి అతనిని దూరం పెట్టానని, అప్పటి నుంచి తన నగ్న ఫోటోలతో బ్లాక్‌మొయిల్ చేస్తున్నాడని, కేవలం తనతోనే కాకుండా మరికొంత మంది అమ్మాయిలతో కూడా ఎఫైర్ పెట్టుకుని, వారిని కూడా వేధిస్తున్నాడని ఆమె తెలిపింది. దీనిపై తాను 6వ నగర పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేశానని, అయితే అక్కడ సిఐ కేసు నమోదు చేయకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపింది. ఇప్పటికైనా పోలీసులు నిత్యపెళ్లికొడుకు అయిన షబీర్ అహ్మద్‌పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి, న్యాయం చేయాలని డిమాండ్ చేసింది