మిస్టర్ కూల్ మహీంద్ర సింగ్ ధోనీకి కార్లు, బైక్‌లు అంటే చాలా ఇష్టం. రాంచీలోని ధోనీ గ్యారేజ్ వీడియో ఇటీవలే వైరల్ అయింది. పదుల సంఖ్యలో క్లాసిక్ బైక్‌లు, కార్లు ఉన్నాయి.
ఈ వీడియోపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సుమారు తన వద్ద 100 బైక్‌లు ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో ధోని చెప్పారు.
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. రాంచీలోని క్రికెట్ స్టేడియానికి వెళ్తుండగా.. ఓ యువ క్రికెటర్‌కు బైక్‌పైన లిఫ్ట్ ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ధోనీ క్లాసిక్ మోడల్ యమహా RD350 బైక్‌ను డ్రైవింగ్ చేస్తున్నాడు. ధోనీతోపాటు క్రికెట్ శిక్షణలో పాల్గొన్న ఓ యువ క్రికెటర్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు.
లాంచీలోని ఓ స్టేడియంలో క్రికెట్ శిక్షణలో ధోనీ పాల్గొనగా.. అక్కడే మరో యువ క్రికెటర్ కూడా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రాక్టిస్ తర్వాత ఆ యువకుడు ధోనీని లిఫ్ట్ అడిగినట్లు తెలుస్తోంది. దీంతో ధోనీ తన యమహా RD350 బైక్‌పైన లిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బైక్ వెనుక సీట్‌పైన కూర్చు్న్న యువ క్రికెటర్ వీడియో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
బైక్‌ను చాలా హుందాగా డ్రైవింగ్ చేస్తున్న ధోనీ మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అయిన తివ్రా హెల్మెట్‌ను ధరించారు. అయితే వెనుక కూర్చున్న యువ క్రికెటర్ మాత్రం ఎటువంటి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాడు. దీంతోపాటు ఈ వీడియోపై మరోరకమైన చర్చ నడుస్తోంది. యమహా RD350 బైక్ ఎగ్జాస్ట్ నుంచి తెల్లని పొగ ఎక్కువగా రావడంపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న బైక్‌లు అంతటి పొగను వెదజల్లవు.
అయితే ఈ వీడియోపై పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఆనాటి ప్రభుత్వ బస్సులు ఇంత పొగను వెదజల్లేవి అంటూ కామెంట్లు చేస్తున్నారు. యమహా RD350 బైక్‌కు విపరీతమైన అభిమాని కారణంగా ఈ బైక్‌ను ధోనీ స్టాండర్డ్‌గా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే ధోనీ బైక్ వెనుక కూర్చున్న యువ క్రికెటర్ హెల్మెట్ ధరించకపోవడంపై కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ధోనీకి బైక్‌లు, కార్లంటే చాలా క్రేజ్. అందువల్లనే ప్రత్యేక కలెక్షన్‌ను కలిగి ఉన్నాడు. 90లలో ఉపయోగించిన యమహా రాజ్‌దూత్ 350తో బైక్‌ల సేకరణ ప్రారంభించాడు. క్లాసిక్, ప్రముఖ మోడల్, విదేశీ స్పోర్ట్స్ బైక్‌లు, స్కూటర్‌ల సేకరణను కలిగి ఉన్నాడు. ధోనీ తన ఖాళీ సమయాల్లో రాంచీ చుట్టు షికార్లు చేస్తూ ఉంటాడు. ఈ వీడియోలు వైరల్ అవుతుంటాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.