MF4TV: పుత్తూరులో ఏపీమున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం స్వతంత్ర సంఘాలు జేఏసీ పిలుపు మేరకు శుక్రవారము పుత్తూరు లో మున్సిపల్ కార్మికులు చెవిలో పువ్వు పెట్టుకొని అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన నిర్వహించారు
ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కనీస వేతనం 26 వేల రూపాయలు మంజూరు చేయాలని, సీయల్స్, క్యాజువల్ అమలు చేయని మున్సిపల్ కార్మికుల డిమాండ్స్ పరిష్కరించాలని తదితర నినాదాలు చేశారు.
మున్సిపల్ కార్మికుల డిమాండ్స్ తక్షణమే పరిష్కరించాలి లేకుంటే సమ్మెను ఉద్రిక్తం చేస్తాం .. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు డి మహేష్
ఈ మున్సిపల్ కార్మికుల సమ్మెను ఉద్దేశించి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు డీ మహేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సమ్మె చివరి ఆయుధమని, సమ్మెకు వెళ్ళుటకు ఈ రాష్ట్ర ప్రభుత్వమే ప్రధాన కారణమని ప్రజలు అనారోగ్యానికి గురైతే దానికి బాధ్యత ప్రభుత్వం వహించవలసి వస్తుందని ఆయన అన్నారు.
ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని పరామర్శించిన మంత్రి కాకాణి
మున్సిపల్ కార్మికుల 21 డిమాండ్స్ పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంఘం స్వతంత్ర సంఘాల జేఏసీ కోరగా అందులో కేవలం డ్రైవర్స్ అండర్ గ్రౌండ్ వర్కర్స్ మలేరియా వర్కర్స్ కు మెడికల్ అలవెన్స్ వర్తింపజేస్తామని, పర్మినెంట్ చేయమని జీతాల పెంచమని ప్రభుత్వం మొండి వైఖరి వ్యవహరించడంతో తప్పనిసరిగా సమ్మెలకు వెళ్తున్నామని పారిశుద్ధ్య కార్మికుల చేస్తున్న సమ్మెకు ప్రజల సహకరించాలని ఆయన అన్నారు ఈ సమ్మెలో ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న వాటర్ వర్క్స్ లో పనిచేయువారు, పార్క్ సుబ్రపరిచేవారు వారికి జీతాలు పెంచాలని, సమ్మె డిమాండ్ సత్వరమే పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని ఆయన అన్నారు.
జపాన్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.: జూనియర్ ఎన్టీఆర్
మున్సిపల్ పాశుద్ధ్య కార్మికుల శ్రమను ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటుందని ఇకనైనా ఆపి వారిని తక్షణమే పర్మిట్ చేయాలని ప్రభుత్వం పెంచుతున్న అధిక ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26 వేల రూపాయలు అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆప్కాస్ కార్మికులకు ఐదు లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఆప్కాస్ లో ఉన్న పిఎఫ్ సమస్యలు స్థానికంగానే పరిష్కరించాలని మున్సిపల్ కాలనీలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి వర్తింప చేయాలని, సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించకుండా దొడ్డేదారిన పనులు చేయిస్తే సహించేది లేదని, ప్రజల ఆరోగ్యాలే మా క్షేమం అంటూ ప్రతినిత్యం దుర్భరమైన జీవితాలు గడుపుతున్న పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించేలా ఈ రాష్ట్ర ప్రజా ప్రతినిధులు స్పందించాలని అన్నారు.
జనసేన పార్టీ నుండి గోపి రాయులు గారు మద్దతు తెలిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలిపారు
‘నా సామి రంగ’ Naa Saami Ranga మూవీ స్టిల్స్, HD గ్యాలరీ
యూనియన్ ఏఐటీయూసీ , జిల్లా ఉపాధ్యక్షులు చంద్రబాబు, నాయకులు గోపి, కార్మికులు గణేష్ కుమార్, సుమన్ ,నాగ ,సుభాషిని, శరవణ, విజయ్ కుమార్, యాకోబు ,అంకయ్య, గోవింద్ స్వామి తదితరులు పాల్గొన్నారు