MF4TV గూడూరు:ఈ రాష్ట్రాన్ని గంజాయి హబ్ గా మారుస్తూ యువతను నిర్వీర్యం చేయడమే కాక ఎన్నికలకు నెల రోజుల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు టోకరా వేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని యువత గద్దె దించాలి
యువతకు గూడూరు తెలుగుదేశం పార్టీ నాయకుల పిలుపు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధిష్టానం ఆదేశం మేరకు గూడూరు మాజీ ఎమ్మెల్యే సూచనల ప్రకారం నేడు రాష్ట్రాన్ని గంజాయి కి నిలయంగా మారుస్తూ యువతను నిర్వీర్యం చేయడమే కాక ఎన్నికలకు నెల రోజుల ముందు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగుల ను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని యువత గద్దె దించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య మరియు తిరుపతి పార్లమెంటు క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ లు ప్రెస్ మీట్ నిర్వహించారు.