సీఎం జగన్ ముస్లింల పక్షపాతి
ఏడు అసెంబ్లీ స్థానాలు మైనారిటీలకు
మళ్లీ జగనన్నను సీఎం చేస్తాం
మైనారిటీలు 90 శాతం వైసీపీ వైపే
వైసీపీ మైనారిటీ సెల్ నాయకుల వెల్లడి
MF4TV గూడూరు : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింల పక్షపాతి అని మరోసారి రుజువైందని వైసీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎండి. మగ్ధూమ్ మొహిద్దీన్ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోని ఏడు నియోజకవర్గాలలో ముస్లింలకు వైసీపీ అభ్యర్థులుగా అవకాశం కల్పించడం శుభ పరిణామమన్నారు. రాష్ట్రంలోని మైనారిటీలు 90 శాతం వైసీపీ వెంటే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటామన్నారు. అలాగే గూడూరు నియోజకవర్గంలోనూ అత్యధిక మెజారిటీతో మేరిగ మురళీధర్ ను గెలిపించుకుంటామన్నారు.
వైసీపీ నాయకులు షేక్. కాలేషా, జీ. జలీల్ లు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులా భావించి అన్ని వర్గాల ప్రజలకు సంక్షే ఫలాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు సిటీ అభ్యర్థిగా మహమ్మద్ ఖలీల్ అహ్మద్ కు కేటాయించడం హర్షణీయమన్నారు.
రాష్ట్రంలో మైనారిటీలకు కేటాయించిన ఏడు స్థానాలలోనూ భారీ మెజారిటీతో వైసీపీ గెలవనుందని తెలిపారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు మగ్ధూమ్,అల్తాఫ్, కాలేషా, జలీల్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు