UPDATES  

NEWS

 పోలియో వలన కాళ్లు పోగొట్టుకున్న ఒక విభిన్న ప్రతిభావంతుని ఆవేదన: మల్లు సుబ్బనరసారెడ్డి 

MF4TV: అతని మాటలో…. నేను అనగా చిన్నప్పుడే పోలియో సోకినటువంటి ఒక వికలాంగుడును నేను. పుట్టుకతో చాలా సాధారణమైనటువంటి వ్యక్తిగానే జన్మించాను కానీ విధి వైపరీత్యం వలన అప్పట్లో ఉన్నటువంటి పోలియో మహమ్మారి బారిన పడి నా చిన్నతనంలోనే నేను నా నడకను కోల్పోవడం జరిగింది నేను ఆనాటి నుండి నేటి వరకు జీవితంలో ఎన్నో సవాళ్లను ఎన్నో పరీక్షలను ఎదుర్కొంటూనే ఉన్నాను అనగా అమ్మఒడి చేరడానికి పరీక్ష ఎదుర్కొన్నాను అలాగే బడిలో పాఠాలు నేర్చుకోవడానికి ఎంతో శ్రమపడి ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ఎంతో కష్టపడి బడికి వెళ్లి పాఠాలు నేర్చుకున్నాను.

మా ఊరు నుండి హైస్కూల్ కి వెళ్లడానికి రెండు కిలోమీటర్లు మేర ట్రై సైకిల్ కూడా లేని దు:స్థితిలో ఎంతో శ్రమతో వెళ్లి చదువుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో పోలియో వ్యాధిగ్రస్తుడైన నేను నా నడకను పోగొట్టుకున్నటువంటి తరుణంలో ఎన్నో ఇబ్బందులు పడి హైస్కూల్,కాలేజి చదవును కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత M.A.,B.Edను ఆ విధంగానే యుద్ధాన్ని చేసి మరి చదువుకున్నాను.

అటువంటి తరుణంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి మాకు ఈ ప్రభుత్వం ప్రభుత్వాల వలన మాకు రోష్టర్ పాయింట్ విధానం వలన శారీరకంగా ఇబ్బందులకు ఎదుర్కొని శారీరకంగా ఎన్నో శ్రమలకి ఓర్చి చదువుకున్నటువంటి మాకు 56వ రోస్టర్ వలన అన్యాయం జరుగుతుంది. దీనికి తోడు కొంతమంది నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి లేదా నిర్లక్ష్యంగా రోడ్లమీద రోడ్డు దాటుతూ యాక్సిడెంట్లకు గురియై వారి యొక్క సొంత తప్పిదం వలన చేసినటువంటి పనులు వలన వికలాంగులుగా మారుతున్నటువంటి వారి వలన పుట్టుకతో పోలియోతో వైకల్యం సంభవించినటువంటి వ్యక్తులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది వాస్తవమా కాదా ఒక్కసారి వికలాంగ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది

ఈ ప్రభుత్వాలు పోలియోను నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్తున్నాయి కానీ పోలియో వలన బాధితులుగా ఉన్నటువంటి వికలాంగులకు ఎటువంటి సదుపాయాలు సౌకర్యాలు కల్పించాము అన్నటువంటి విషయాలను గాలికి వదిలేస్తున్నాయి వికలాంగులు అంటే కేవలం పింఛనుదారులేనా ఈ పింఛను కూడా పోలియో వ్యాధిగ్రస్తులకు ఒకలాగా మరియు నిర్లక్ష్యంగా వారి యొక్క శారీరక భాగాలను పోగొట్టుకున్నటువంటి వారికి మరోలాగా ఇచ్చినట్లయితే చిన్నప్పటి నుంచి అంటే పుట్టినప్పటినుంచి నేటి వరకు వికలాంగుడుగా ఉన్నటువంటి వాళ్లకి ఒక ఆదర్శంగా ఉంటుంది.

అలా కాకుండా శాతాన్ని పట్టించి వికలాంగత్వాన్ని నిర్ణయించడం అనేది దౌర్భాగ్యకరమైనటువంటి అంశం ఎందుకనగా పోలియో వ్యాధిగ్రస్తుడు అనేవాడు చిన్నప్పుడే తన యొక్క శరీర అవయవాలను కోల్పోయి జీవితంలో బతకడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు .

ఈ యాక్సిడెంట్ల వలన వారి యొక్క సొంత తప్పిదాల వలన అవయవాలు కోల్పోయినటువంటి వ్యక్తులు ఎవరైతే వున్నారో వారు యొక్క అవగాహన రాహిత్యము వలన వికలాంగులను ఎవరైతే పోలియో వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారిని అవమానకరంగా మాట్లాడటం వారి యొక్క రిజర్వేషన్లను తీసుకోవడానికి పోటీ పడడం లాంటిది చాలానే చూస్తూనే ఉన్నాం.

మనం ఈ సమయంలో 56 రోష్టరు పాయింట్ మారడము అలాగే ఎవరైతే పోలియో వ్యాధిగ్రస్తులైనటువంటి శారీర వికలాంగులు ఉన్నారు వారికి ఉద్యోగాలలో మొదటి ప్రాధాన్యత అనేది చాలా అవసరం. ఇది శారీరక వికలాంగుడిని అయినటువంటి నా యొక్క ఆవేదన మాత్రమే దయచేసి నా తోటి శారీరక వికలాంగులు అయినటువంటి వికలాంగులు నా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని నా యొక్క ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి వెళ్లే విధంగా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |

© Copyright MF4TV 2024 - All rights reserved.

Developed by RAAMSEE